లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఏఎస్ఓ..

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఏఎస్ఓ..

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఏఎస్ఓ..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటున్న ఏఎస్ఓను మంగళవారం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. రేగొండ మండల కేంద్రానికి చెందిన అడ్లూరు మల్లికార్జున అనే బాధితుడు చనిపోయిన తన అత్తగారైన ఒడేటి కాంతమ్మకు సంబంధించిన మరణ ధ్రువీకరణపత్రం కోసం మండల పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న ఏఎస్ఓ రఘుపతిని సంప్రదించాడు. ఇందుకుగాను ఆ అధికారి రూ.3వేలు లంచం డిమాండ్ చేసి, రూ.2వేలకు బేరం కుదుర్చుకున్నాడు.

బేరం కుదుర్చుకున్నాక కూడా గడిచిన 80 రోజుల నుండి అధికారి మరణ దృవీకరణ పత్రం ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాడు. దీనితో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఈ క్రమంలోనే స్థానిక కలెక్టరేట్ కార్యాలయం గేటు వద్ద డబ్బులు తీసుకుంటుండగా ఎసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రేగొండ మండల పరిషత్ లో అసిస్టెంట్ స్టాటాజికల్ అధికారి(ఏఎస్ఓ) రఘుపతిని పట్టుకున్న ఏసీబీ అధికారులు స్థానిక ఆర్డీఓ ఆఫీసుకు తీసుకెళ్లి విచారణ విచారణ చేపట్టారు.