భూపాలపల్లి జిల్లాలో రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభం..

భూపాలపల్లి జిల్లాలో రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభం..

తొలి రోజు రిజిస్ట్రేషన్ పత్రాలు అందించిన డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్, కలెక్టర్..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శనివారం రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తొలిరోజు డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ సైదిరెడ్డి, జిల్లా రిజిస్ట్రార్ హారికొట్ల రవి, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ల చేతుల మీదుగా రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా వాసులకు అందుబాటులో రిజిస్ట్రేషన్ సేవలు ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్, కార్యాలయ సిబ్బంది, రిజిస్ట్రేషన్ దారులు పాల్గొన్నారు.