విట్టల్  రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు

విట్టల్  రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు

 లోకేశ్వరం,ముద్ర:లోకేశ్వరం మండల కేంద్రంతో పాటు పుస్పూర్ ,  నగర్, ఏప్రిల్  గ్రామంలో విట్టల్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోనికి భారీగా చేరికలు జరిగాయి.పుస్పూర్ గ్రామ సర్పంచ్  సంగెం  నర్సయ్య తో పాటు  మరికొందరు లోకేశ్వరంలో  హరీష్ తో పాటు వేరే పార్టీ కార్యకర్తలు బి ఆర్ఎస్  పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పుస్పూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విట్టల్ రెడ్డి పాల్గొని ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాలకు ఎందరికో సహాయం అందించారు అన్నారు.మహిళలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్,రైతుబంధు,రైతు బీమా,దళిత బంధు, బీసీ బందు,ఇంటింటికి త్రాగునీరు కలెక్షను ఇవ్వడం జరిగిందని అన్నారు, ఇంతే కాకుండా మహిళలకు బిడి పించెను,వికలాంగులకు వికలాంగుల పింఛను, వృద్ధులకు వృద్ధాప్య పింఛను ఇలా ఎన్నో రకాల పథకాల ప్రవేశపెట్టి బడుగు బలహీన ప్రజలకు ఎంతగానో ఆదుకుంటున్నారు, రాబోయే ఎలక్షన్లలో బిఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీ గెలిపించాలని ఆయన కార్యకర్తలను,ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ లోలం  శ్యాంసుందర్ పిఎసిఎస్ చైర్మన్ రత్నాకర్ రావు లోకేశ్వరం మండల బిఆర్ఎస్ కన్వీనర్ కలిపే శ్యాంసుందర్, ఎంపీపీ లలిత భోజన్న లోకేశ్వరం సర్పంచ్ సౌజన్య కపిల్ వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు వివిధ గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు.