పండుగ పూట పల్లెల్లో హైమక్ష్ లైట్ల వెలుగులు -జడ్పీటీసీ గీకురు రవీందర్

పండుగ పూట పల్లెల్లో హైమక్ష్ లైట్ల వెలుగులు -జడ్పీటీసీ గీకురు రవీందర్

చిగురుమామిడి ముద్ర న్యూస్: మండలంలోని గ్రామాలలో 24 హైమాక్స్ లైట్లు బిగిస్తున్నట్లు చిగురుమామిడి జడ్పీటీసీ  గీకురు రవీందర్ తెలిపారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ... జిల్లా పరిషత్ నిధుల నుండి 25లక్షల 80వేలు మంజూరు చేయించి 24 హైమాక్స్ లైట్లను బిగిస్తున్నామని తెలిపారు. గత మాసములో మంజూరైన లైట్లను  దసరా, సద్దుల బతుకమ్మ పండుగ వేళ పల్లెలలో ముఖ్యమైన చౌరస్తాలలో యుద్ద ప్రాతిపదికన పనులు పూర్తిచేస్తున్నామన్నారు.హైమాక్స్ వెలుగులలో బతకమ్మ ఆడుకోవడంపై ఆడపడుచులు ఆనందం వెలిబుచ్చుతున్నారని తెలిపారు. గత నాలుగు సంవత్సరాలలో వివిధ గ్రాంట్లు నుండి పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలను 1 కోటి 10 లక్షల నిధులు మంజూరయ్యాయన్నారు. మండల సమగ్రాభివృద్ధి ధ్యేయంగా పని చేస్తున్నామన్నారు. పనుల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల మౌలిక సదుపాయాల కొరకు, అంబేద్కర్ విగ్రహాల ముందు హైమస్ లైట్ల కొరకు, ఎస్సీ, బీసీ కాలనీల అభివృద్ధి కొరకు అధిక నిధులు వెచ్చించామని తెలిపారు. నిధుల మంజూరుకు సహకరించిన జడ్పి చైర్ పర్సన్ కనుమల్ల విజయ,ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్లకు కృతజ్ఞతలు తెలిపారు.