ఇసుక అవినీతి దందాపై రేవంత్ రెడ్డి ఉక్కుపాదం ..

ఇసుక అవినీతి దందాపై రేవంత్ రెడ్డి ఉక్కుపాదం ..

ముద్ర,తెలంగాణ:- ఇసుక పాలసీ అక్రమ దందాగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇకపై ఇసుక అక్రమంగా రవాణా జరగకుండా విజిలెన్స్ ఏసీబీ విభాగాలతో తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీని తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చటంతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండే విధివిధానాలుండే కొత్త పాలసీ రూపొందించాలని అధికారులకు సూచించారు.

ఈ అవినీతి వ్యవస్థకు అడ్డుకట్టవేసేందుకు అన్ని స్థాయిల్లో అధికారులు తమ పద్ధతి మార్చుకోవాలని 48 గంటల డెడ్లైన్ విధించారు.రెండు రోజుల తర్వాత విజిలెన్స్, ఏసీబీ విభాగాలను రంగంలోకి దింపాలని అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో వెంటనే తనిఖీలు చేపట్టాలని, బాధ్యులైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టవద్దని సీఎం హెచ్చరించారు.