చేతి పై మహాత్ముని టాటూ వేసుకున్న వీరాభిమాని

చేతి పై మహాత్ముని టాటూ వేసుకున్న వీరాభిమాని
  • నాణెములు, స్టాంప్స్, దేశ నాయకుల చరిత్రల సేకరణ అతని హాబీ 

సిరిసిల్ల టౌన్, ముద్ర:సిరిసిల్ల పట్టణం, నెహ్రూనగర్ కి చెందిన కోత్వాల్ సాయిరాం కు చిన్నప్పటినుండి మహాత్మా గాంధీ అంటే చాలా అభిమానం, ప్రేమ. గాంధీజీ పై తనకున్న అభిమానానికి గుర్తుగా గాంధీ 154వ జయంతి సందర్భంగా చేతిపై గాంధీ బొమ్మను పచ్చ బొట్టుగా వేయించుకున్నాడు సాయిరాం. ఇప్పటివరకు మహాత్మా గాంధీ కి సంబందించిన 5000 చిత్రాల సేకరించాడు. అలాగే వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన స్వామి వివేకానంద పుస్తకాలు 400 సేకరించాడు. స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం తర్వాత చలామణిలో ఉన్న అన్ని రకాల నాణములు, దేశ నాయకుల చరిత్రలు, స్వాతంత్ర సంగ్రామం ఘట్టాలకు సంబంధించిన అరుదైన ఫొటోస్ ఎన్నో తన ఇంటిలో భద్రంగా ఉంచాడు.

190 దేశాల కాయిన్స్ కలెక్షన్, స్టాంప్ కలెక్షన్, పాతబస్సు టికెట్లు ఒక 5000, ఎయిర్టెల్ రీఛార్జ్ కార్డులు 6000, తెలంగాణ అమరవీరుల ఫొటోస్ సేకరణ, 70 సంవత్సరాల క్రితం పాటల పుస్తకాలు, సినిమా స్టోరీస్, సెలబ్రిటీస్ యొక్క సంతకాల సేకరణ ఇలా ఒక 11 రకాల హాబీస్ తనకు ఉన్నాయి అని చెప్పాడు సాయిరాం. తన సేకరణ లను గుర్తించి మహారాష్ట్రలోని తెలుగునాభిక 'సమాజ్ భూషణ్' అనే అవార్డుతో సత్కరించారు. తెలుగు వెలుగు వరంగల్ సంస్థ వాళ్ళు ఉగాది పురస్కారంతో,  లంబోదర కల్చర్ అకాడమీ వారు ఉగాది పురస్కారంతో, అలాగే స్ఫూర్తి ఫౌండేషన్ వారు భారత సేవా రత్న అనే పురస్కారం తో తెలుగు యూనివర్సిటీ హైదరాబాదులో సత్కరించారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సాయిరాం రాసిన రచనకు తెలంగాణ ప్రభుత్వం ఒక వెయ్యి 116 రూపాయలు తో పాటు సర్టిఫికెట్, మెమెంటో శాలువాతో ఘనంగా సత్కరించారు.