ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు కేసీఆర్​ మొగ్గు చూపారు: కేటీఆర్​

ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు కేసీఆర్​ మొగ్గు చూపారు: కేటీఆర్​

బయ్యారం, కడపలో స్టీల్​ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ  ఇచ్చిందన్న మంత్రి కేటీఆర్​. బయ్యారం స్టీల్​ ప్లాంట్​ కోసం నేను ప్రధానిని కలిశానన్నారు.  బయ్యారం విషయంలో మమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మోదీకి చెప్పాం. నేను ప్రధానిని కలిసిన నాలుగు నెలల కు అదానీ గ్రూప్​ కంపెనీ పెట్టింది. బైలదిల్లాలో ఐరన్​ ఓర్ కంపెనీ ​ స్టార్ట్​ చేస్తున్నామని కేంద్రం చెప్పింది. కాని బైలదిల్లా ఐరన్​ ఓర్​ కంపెనీని అదానీ స్టార్ట్​ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు కేసీఆర్​ మొగ్గు చూపారు. పీఎస్​యూలు అమ్మేస్తే వచ్చే సమస్యలేంటో చాలాసార్లు చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో బీహెచ్​ఈఎల్​కు అధికంగా ఆర్డర్లు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. బీమా పథకాలన్నీ ఎల్​ఐసీకి అప్పగించారు. నష్టాలను జాతికి అంకితం చేయడం, లాభాలు నచ్చిన వ్యక్తులకు అప్పగించడం కేంద్రం ఆలోచన. సెయిల్​ ద్వారా బయ్యారంలో స్టీల్​ ఫ్యాక్టరీ ఏర్పాటు పరిశీలిస్తామని విభజన చట్టంలో కేంద్రం స్పష్టంగా చెప్పిందన్నారు.