ప్రారంభమైన జాతీయ యూత్​ కాంగ్రెస్​ సమావేశం

ప్రారంభమైన జాతీయ యూత్​ కాంగ్రెస్​ సమావేశం
  • మొదటిసారిగా హైదరాబాద్​లో నిర్వహణ
  • యూత్ కాంగ్రెస్ రాష్ర్ట అధ్యక్షుడు శివసేనరెడ్డి 

ముద్ర, తెలంగాణ బ్యూ‌‌రో : జాతీయ యూత్​ కాంగ్రెస్​ సమావేశం హైదరబాద్ లోని కత్రియా హోటల్ లో బుధవారం ప్రారంభమయ్యాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు  నిర్వహించనున్న యూత్​ కాంగ్రెస్​ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనరెడ్డి తెలిపారు. జాతీయ కార్యవర్గ సమావేశాలకు దేశం నలు మూలాల నుంచి యువజన కాంగ్రెస్ నాయకులు హాజరైనట్లు ఆయన తెలిపారు. జాతీయ సమావేశాలను  హైదరాబాద్​లో మొదటిసారిగా ఏర్పాటుచేసిన ఆయన తెలిపారు. వచ్చే 5 రాష్ట్రాల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ పాత్రపై ఈ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. తెలంగాణలో యూత్ కాంగ్రెస్ భారీ కార్యక్రమాలు చేపట్టబోతుందని తెలిపారు. యూత్ డిక్లరేషన్ ను ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు బస్సు యాత్ర చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. యూత్ కమిషన్ ద్వారా నిరుద్యోగులు స్వయం ఉపాధి కల్పించేందుకు రూ.10 లక్షల ఆర్థిక సాయం చేసే విధంగా వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. సమావేశ ప్రారంభంలో ఒరిస్సా రైలు ప్రమాదంలో మృతిచెందిన వారికి ఆత్మశాంతి కోసం  మౌనం పాటించి నివాళులర్పించారు.  జాతీయ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్​కుమార్ గౌడ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ చార్జి  కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.