పని చేసే ప్రభుత్వం మాది

పని చేసే ప్రభుత్వం మాది
  • జూట మాటలతో ప్రజల్ని ఏ మార్చలేరు మీరు
  • క్యాంపు కార్యాలయంలో బీసీలకు, దివ్యాంగులకు ఆర్థిక సాయం చెక్కులు అందజేసిన మంత్రి హరీష్ రావు

ముద్ర ప్రతినిధి,సిద్దిపేట:-పనిచేసే ప్రభుత్వం తమదని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చెప్పారు. కొందరు పనిగట్టుకొని జూట మాటలు చెబుతూ ప్రజలను ఏ మార్చాలని చూస్తున్నారని వారి ఆటలు ఇక్కడ సాగ వని బిజెపి,కాంగ్రెస్ నేతలను పరోక్షంగా విమర్శించారు. మంగళవారం నాడు సిద్దిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో బీసీ కార్పొరేషన్ ద్వారా వెనకబడిన తరగతుల కులవృత్తిదారులకు 66 మందికి 100% సబ్సిడీతో లక్ష రూపాయల ఆర్థిక సహాయం,49 మంది దివ్యాంగులకు  50 వేల రూపాయల చొప్పున స్వయం ఉపాధి కొరకు లోన్ చెక్కులను లబ్ధిదారులకు మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూబీసీ కుల వృత్తిదారులు వ్యాపారం చేసుకుని వారి కాళ్లపై వాళ్లు నిలబడి గౌరవంగా జీవించాలనే గొప్ప లక్ష్యంతో ప్రభుత్వం లక్ష రూపాయలు చొప్పున 100% సబ్సిడీతో ఆర్థిక సహాయం అందజేస్తున్నదన్నారువిడతలవారీగా అర్హత ఉన్న బీసీ కుల వృత్తుదారులందరికీ ఆర్థిక సహాయం అందుతుందన్నారు అలాగే ఏ పని చేయాలన్నా  శారీరకంగా చాలా ఇబ్బందులకు గురయ్యే, సమాజంలో కొందరి చేత చిన్నచూపు చూడబడుతున్న దివ్యాంగులు వ్యాపారం చేసుకుని  సగౌరవంగా  జీవించేందుకు జిల్లాలో ఈరోజు 49 మందికి 50 వేల రూపాయల చొప్పున రుణం అందించామన్నారు. ఈ మధ్యనే జిల్లాలో 101 మంది దివ్యాంగులకు స్కూటీలను ఉచితంగా అందించామని తెలిపారు దివ్యాంగుల బాధలను గుర్తించి వారిని ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు.దివ్యాంగుల పింఛను మహారాష్ట్రలో 900 నుంచి 1200, కర్ణాటకలో  1000 నుండి 1200, గుజరాత్లో 900 మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. ఏ రాష్ట్రంలో కూడా 1000 నుండి 1200 లకు మించి దివ్యాంగుల పెన్షన్ ప్రభుత్వం ఇవ్వడం లేదని  కెసిఆర్ ప్రభుత్వం మాత్రం  3016 రూపాయలు ఇస్తుందని,సీఎం కేసీఆర్ తల్లి మనసుతో ఆలోచించి   దానిని ఈ నెల నుండి   4016 కు పెంచాలని నిర్ణయించారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా  4 లక్షల 50 వేల మంది దివ్యాంగులు ఉన్నారు వారికి నెల నెల 4016 రూపాయల పింఛను అందనుందని వివరించారు. 

 ఈ సందర్భంగా  నంగునూరు మండల కేంద్రంలో మధ్యలో బటర్ఫ్లై లైట్లతో  ఏర్పాటు చేస్తున్న నాలుగు వరుసల రహదారి నిర్మాణం త్వరగా పూర్తి చేస్తామని తెలుపుతూ నంగునూరు మండలంలో  గంగిరెద్దుల సంఘం కుల భవన నిర్మాణానికి 10 లక్షలు, శాలివాహన కుల భవన నిర్మాణానికి 10 లక్షలు, వైశ్య సంఘం కుల భవనానికి 10 లక్షలు, ముస్లిం పీరీ కొట్టానికి 10 లక్షలు, తురక కాశల్ల భువన నిర్మాణానికి 10 లక్షలు, ఆటో యూనియన్ భవ నిర్మాణానికి 10 లక్షల రూపాయల చొప్పున చెక్కులను ఆయా సంఘాల ప్రతినిధులకు మంత్రి అందజేశారు.