గజ్వేల్ లో 21న  పర్యటించ నున్న మంత్రి హరీష్ రావు

గజ్వేల్ లో 21న  పర్యటించ నున్న మంత్రి హరీష్ రావు

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి: ఈ నెల 21 శుక్రవారం రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో పర్యటిస్తారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవలు చేస్తారు. 16 వ వార్డ్ లో బీసీ కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం,  17 వ వార్డ్ ముట్రాజ్ పల్లెలో టీఎన్జీవో భవన ప్రారంభోత్సవం, ముట్రాజ్ పల్లి ముస్లిం మైనార్టీ గ్రేవ్ యార్డ్ ప్రహరీ గోడ ప్రారంభోత్సవం.
ప్రభుత్వ దవాఖాన చౌరస్తా వద్ద  పిడ్ చెడ్ రోడ్ నుండి వి మార్ట్ వరకు బటర్ ఫ్లై లైట్ల ప్రారంభోత్సవం, తూప్రాన్ రోడ్డు వై జంక్షన్ నుండి సంగుపల్లి వరకు బటర్ ఫ్లై లైట్ల ప్రారంభోత్సవం గజ్వేల్ అగ్రికల్చర్  మార్కెట్ కమిటీ ఆవరణలో ల్యాబ్ టెస్టింగ్ భవన ప్రారంభోత్సవం.

మదీన మజీద్ లో సాయంత్రం 6:30 గంటలకు రంజాన్ పండుగ సందర్భంగా ఇఫ్తార్ విందు కార్యక్రమం, సంగాపూర్ కమాన్ నుండి ఐఓసీ రోడ్లో సంగాపూర్ వరకు బటర్ ఫ్లై లైట్ల ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్ రావు పాల్గొంటారని గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్.సి రాజమౌళి తెలిపారు మంత్రి కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆయన కోరారు