కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలను  నశించాలి: సిఐటియు జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ

కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలను  నశించాలి: సిఐటియు జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ

చండూరు, ముద్ర:కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలు నశించాలని,నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు చిన్న పాక లక్ష్మీనారాయణ కేంద్ర  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శుక్రవారం దేశ వ్యాప్త కార్మికుల సమ్మె సందర్భంగా ఇందిరా గాంధీ చౌరస్తా నుండి చండూర్ మార్కెట్ వరకు సిఐటియు ఆధ్వర్యంలో అన్ని రంగాల కార్మికుతో ర్యాలీ నిర్వహించారు. రాజీవ్ గాంధీ సెంటర్లో సభ నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు అయినా రైతాంగ కార్మిక వర్గ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపించారు. భారతదేశం వెలిగిపోతుంది, అచ్చేదిన్ ఆగయా విశ్వ గురువు ఆత్మనిర్బర్ భారత్, మేకిన్ ఇండియా వంటి మోసపూరిత నినాదాలు ఇచ్చిన ఏమీ ఒరగలేదు అని వారన్నారు.. బిజెపి అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం 200 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అది నీటి మూటగానే మిగిలిపోయిందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, సహజ వనరులను కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ల పరం చేస్తుందని, వ్యూహాత్మక అమ్మకాల పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలలో 100% వాటాలను తెగ నమ్ముతున్నది. నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ పాలసీ ద్వారా మౌలిక వసతులను లీజు పేరుతో ప్రైవేటీకరణ చేస్తున్నది. అనేక త్యాగాల తో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తెచ్చిందని అన్నారు. కనీస వేతనాలు నిర్ణయించే విధానానికి స్వస్తి పలికిందని ,సమ్మె హక్కును కాలరాస్తుందని, పీఎఫ్, ఈఎస్ఐ, వెల్ఫేర్ బోర్డులను నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఇచ్చిన సూచనలను పాటించే పరిస్థితిలో లేదని ,నూతనంగా 12 గంటలు పని విధానం తీసుకురావడానికి కుట్ర చేస్తుందని అన్నారు. నాలుగు లేబర్ కోడ్ల్ ను రద్దు చేయాలని కనీస వేతన చట్టాలను అమలు చేయాలని వెంటనే ఆశ మధ్యాహ్నం భోజనం ఐకెపి వివోఏ గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని స్కీం వర్కర్లను పర్మినెంట్ చేయాలని అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ జెర్రిపోతుల ధనంజయ గౌడ్, సిఐటియు జిల్లా నాయకులు మోగుదాల వెంకటేశం, సిఐటియు సీనియర్ నాయకులు చిట్టిమల్ల లింగయ్య,మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు, అన్నేపర్తి వెంకన్న, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి కత్తుల సైదులు, ఉపాధ్యక్షులు నల్లగంటి లింగస్వామి, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్  మండల అధ్యక్షులునాంపల్లి శంకర్, మండల ప్రధాన కార్యదర్శి ముంతవెంకటేశ్వర్లు, హమాలి వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు పాశం లింగయ్య, ఉపాధ్యక్షులు  చిన్న వెంకన్న, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల సహాయ కార్యదర్శి  వెంకటాచారి, కొండల్,మండల ఉపాధ్యక్షులు నాగిళ్ల లక్ష్మణ్,  బేరే బిక్షమయ్య,నారపాక యాదయ్య, సత్తిరెడ్డి,లింగయ్య,మహేందర్ తదితరులు పాల్గొన్నారు.