ఘనంగా స్వయంభు శ్రీ శ్రీ శ్రీ పూర్ణగిరి సుదర్శన లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణ వేడుకలు

ఘనంగా స్వయంభు శ్రీ శ్రీ శ్రీ పూర్ణగిరి సుదర్శన లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణ వేడుకలు

భువనగిరి మార్చి 11 (ముద్ర న్యూస్) భువనగిరి మండలంలోని నమాత్ పల్లి గ్రామంలో శనివారం స్వయంభు శ్రీ పూర్ణగిరి సుదర్శన లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం  అనిల్ కుమార్ రెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణరెడ్డిలు హాజరై,  మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీపీ నారాల నిర్మల వెంకటస్వామి యాదవ్, జడ్పిటిసి సూబ్బురు భీరు మల్లయ్య, గ్రామ సర్పంచ్ ఎల్లంల శాలిని జంగయ్య యాదవ్, ఎంపిటిసి మట్ట పారిజాత శంకర్ బాబు, ఆలయ కమిటీ చైర్మన్ అతికం లక్ష్మీనారాయణ గౌడ్, నరసింహ స్వామి ఉపాసకులు బత్తిని రాములు గౌడ్,  ఆలయ నిర్మాణ దాత ముసలి ఉదయ్ కుమార్ రెడ్డి , సోలిపురం శ్రీకాంత్ రెడ్డి, భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, నాగిరెడ్డి పల్లి సర్పంచ్ జక్క కవిత రాఘవేందర్ రెడ్డి, నందనం సర్పంచ్ కడమంచి ప్రభాకర్, ఏర్రంబల్లి సర్పంచ్ గాదే యశోద, జిల్లా నాయకులు ర్యాకల శ్రీనివాస్, గాదే  ఆంజనేయులు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ఆలయ ధర్మకర్తలు జిట్టా చంద్రారెడ్డి, కంబాలపల్లి మంగమ్మ అంజనేయులు, పబ్బతి జంగయ్య స్వరూపంగా సత్తమ్మ , టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు జనగం పాండు, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కోట పెద్ద స్వామి, మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్, వివిధ జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.