యాదగిరిగుట్టలో రాష్ట్ర జానపద కళాకారుల భజన మండలి సమావేశం

యాదగిరిగుట్టలో రాష్ట్ర జానపద కళాకారుల భజన మండలి సమావేశం

యాదగిరిగుట్ట, మార్చి 11 (ముద్ర న్యూస్): యాదాద్రి పాత లక్ష్మినర్సింహా దేవాలయం ప్రాగణం గీత ఆశ్రమంలో శనివారం జరిగిన జానపద కళాకారుల భజన మండలి అధ్యక్షులు పి. యాదగిరి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం సమావేశం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అఖిల భారత హిందూ మహాసభ ప్రధాన కార్యదర్శి శ్రీ శ్రీ శ్రీ కమలేష్ దాస్ మహారాజ్ జి, హిందూ మహాసభ ధర్మ ఆచార్య సంస్థ ప్రధాన కార్యదర్శి  యోగి అతిదేశ్వర స్వామి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సురేష్ ఆత్మరాం మహారాజ్, తెలంగాణ ఇంచార్జి చేవ్వ చిత్తరంజన్, లీగల్ ఇంచార్జి బి బాలరాజు, మొగలి చందు, మాదేల్, యాదాద్రి  బీజేపీ సీనియర్ నాయకులు రచ్చశ్రీనివాస్ లు పాల్గొన్నారు.

అనంతరం భజన మండలి కళాకారులు ప్రదర్శన గా యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ దేవాలయం వెళ్లి దేవాలయం ఈఓ గీతారెడ్డి , వంశ పారంపర్య ధర్మకర్త ను కలిసి భజన మండలి కళాకారులకు దేవాలయం లో నిత్యం భజనకు అవకాశం కల్పిచాలని వినతిపత్రం ఇచ్చారు. వారు సహకరిస్తామని చెప్పినారు. దేవాలయం ప్రాంగణం లో సుమారు 1000 మంది భజన కళాకారులు ఉత్సాహం గా శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారి భజన చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు.