తెల్లరాళ్లపల్లి తాండలో ఘనంగా తుల్జ భవాని ఉత్సవాలు

తెల్లరాళ్లపల్లి తాండలో ఘనంగా తుల్జ భవాని ఉత్సవాలు

ముద్ర,పానుగల్ పానుగల్ మండల పరిధిలోని తెల్లరాళ్లపల్లి తాండలో మంగళవారం తుల్జా భవాని ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు.గిరిజనుల ఆరాధ్య దైవం తుల్జా భవాని అని,సాంప్రదాయ పద్ధతులతో ఉత్సవాలను జరుపుకున్నారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శాంతమ్మ, గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాల్య నాయక్ లు మాట్లాడుతూ గ్రామ ప్రజలు శాంతి యుతంగా ఉండాలని, గిరిజన కుటుంబాలు చల్లగా ఉండాలని, ప్రతి ఏడాది పంటలు పండాలని పూజలు నిర్వహించారు. గ్రామంలో తుల్జా భవాని దేవతను చిన్నారి బాలికలు ఎత్తుకుని ర్యాలీగా నిర్వహించి దేవతలను పూజించారు.రెండు సంవత్సరాలకు ఒకసారి తుల్జా భవాని పండుగను జరుపుకోవడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు, తాండ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.