సీఎం జగన్‌ పై దాడి…ఈసీ సీరియస్…

సీఎం జగన్‌ పై దాడి…ఈసీ సీరియస్…

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ముఖ్యమంత్రి జగన్ పై దాడిని ఎన్నికల సంఘం సీరియస్ తీసుకుంది. ఎన్నికల సమయంలో సీఎం పైనే దాడి జరగటాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటన పైన ప్రాధమిక సమాచారం సేకరించింది. పూర్తి నివేదిక ఇవ్వాలని పోలీసు అధికారులను ఆదేశించింది. దాడికి కారకులను తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. కేంద్రం సైతం ముఖ్యమంత్రి పై దాడి అంశం పైన ఆరా తీసినట్లు సమాచారం. రాజకీయ ప్రమేకంతో పాటుగా భద్రతా వైఫల్యం ఉందా అనే కోణంలోనూ చర్చ సాగుతోంది.