కార్మిక సంక్షేమ ప్రభుత్వం బీఆర్ఎస్

కార్మిక సంక్షేమ ప్రభుత్వం బీఆర్ఎస్
  • భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉంటా
  • రాబోయే ఐదేళ్లలో ఉన్న సూర్యాపేట డబుల్ అవడం ఖాయం
  • దేశం అబ్బురపడేలా సూర్యాపేట అభివృద్ధి చేస్తా
  • కార్మికులకు చేతినిండా పని కడుపునిండా తిండి పెడుతున్న పార్టీ బిఆర్ఎస్
  • కెసిఆర్ పాలనలో అని రంగాలకు ప్రాధాన్యం
  • ఆశీర్వదించండి తలెత్తుకునేలా చేస్తా
  • సందడిగా ఆత్మీయ సమ్మేళనాలు
  • బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో సరికొత్త జోష్‌
  • మంత్రి జగదీశ్ రెడ్డి కి మద్దతుగా ఏకమవుతున్న సబ్బండవర్గాలు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-దేశ ప్రజలు అబ్బురపడేలా సూర్యాపేట ను అభివృద్ధి చేస్తానని సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో సూర్యాపేట ను అభివృద్ధి చేసిన జగదీషు నీకే మా మద్దతు అంటూ, కార్మిక, కుల, వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంఘాల తోపాటు సబ్బండ వర్గాలు ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకొని మంత్రి జగదీష్ రెడ్డికి మద్దతు తెలుపుతున్నారు. సూర్యాపేట లో పట్టణానికి చెందిన గోల్డ్ వ్యాపారులు, భానుపురి భవన నిర్మాణ కార్మికులు, ముదిరాజు సోదరుల ఆత్మీయ సమ్మేళనాలకు ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి తనకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కార్మికులకు చేతినిండా పని కడుపునిండా తిండి పెడుతున్న పార్టీ బిఆర్ఎస్ అన్నారు. కెసిఆర్ పాలనలో అన్ని రంగాలకు ప్రాధాన్యం ప్రాధాన్యం లభించిందన్నారు. రోజురోజుకు విస్తరిస్తున్న సూర్యాపేట పట్టణం, రాబోయే ఐదేళ్లలో ఉన్న పట్టణానికి రెండింతలు అవడం ఖాయమన్నారు. సూర్యాపేటలో అదుపులో శాంతిభద్రతల కారణంగానేప్రపంచ స్థాయి వ్యాపార సంస్థల పట్టణానికి క్యూ కడుతున్నాయి అన్నారు. గతంలో సూర్యాపేటలో వ్యాపారాలు చేసుకోవాలంటే  బెదిరింపులు, రౌడీ మామూళ్ల తొ వ్యాపారులు పారిపోయే వారని అన్నారు. మళ్లీ అదే నాయకుడు తనకు ఓటేయాలని ప్రజలలోకి రావడం హాస్యాస్పదం అన్నారు. పొరపాటున ఓటు వేస్తే మళ్లీ పాత రోజులు పునారవృతం కావడం ఖాయం అన్నారు. మరోసారి ఆశీర్వదిస్తే తనకు ఓటు వేసిన వారు తలెత్తుకొని గర్వపడేలా సూర్యాపేటలో అభివృద్ధి చేస్తాను అని హామీ ఇచ్చారు.  ఆత్మీయ సమ్మేళనాలతో తనకు మద్దతు తెలిపిన ప్రతీ ఒక్కరికీ మంత్రి జగదీష్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.