పెండింగ్ సీఎంఆర్ ధాన్యము ఈనెల 31 లోగా పూర్తి చేయాలి

పెండింగ్ సీఎంఆర్ ధాన్యము ఈనెల 31 లోగా పూర్తి చేయాలి

అదనపు కలెక్టర్ జీవి శ్యాం ప్రసాద్ లాల్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :యాసంగి 2021- 22 పెండింగ్ సిఎంఆర్ ధాన్యమును ఈ నెల 31 లోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ జీవీ శ్యాం ప్రసాద్ లాల్ తెలిపారు.
మంగళవారం అదనపు కలెక్టర్ ఛాంబర్ లో రైస్ మిల్లర్స్, పౌర సరఫరాల శాఖ అధికారులతో జిల్లాలోని బకాయి ఉన్న సిఎంఆర్ ధాన్యం పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సిఎంఆర్ ధాన్యము బకాయి ఉన్న రైస్ మిల్లర్స్ రోజువారీగా పెట్టాల్సిన సీఎంఆర్ ధాన్యమునకు టార్గెట్ నిర్దేశించారు. టార్గెట్ ప్రకారం సీఎంఆర్ ధాన్యమును మే 31 లోగా పూర్తిచేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సురేష్, జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నర్సింగారావు, కార్యదర్శి కరుణాకర్, పలువురు రైస్ మిల్లర్స్ పాల్గొన్నారు.