సుందరమైన నగరం కరీంనగర్

సుందరమైన నగరం కరీంనగర్
  • 1 కోటి రూపాయల తో సెంటర్ లైటింగ్
  • మంత్రి గంగుల కమలాకర్

ముద్ర ప్రతినిధి కరీంనగర్: వీది దీపాల వెలుగులతో కరీంనగర్ నగరానికి వన్నెతెస్తున్నామని పౌర సరఫరాల, భిసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ అభివృద్ధి లో బాగంగా మంగళవారం సాయంత్రం నగరపాలక సంస్థ ఆద్వర్యంలో కోటి రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన నూతన సెంటర్ లైటింగ్ ను నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణీ హరిశంకర్, పలువురు కార్పోరేటర్ల తో కలిసి మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. కమాన్ చౌరస్తా నుండి కేబుల్ బ్రిడ్జ్ వరకు  లైటింగ్ సిస్టమ్ ను అమర్చారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ కరీంనగర్ నగరాన్ని ఒక సుంధర మైన నగరంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ సహాకారంతో నగరానికి కేబుల్ బ్రిడ్జ్, మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణం తో నగరాన్ని పర్యటక కేంద్రం గా మారుస్తున్నామని తెలిపారు. నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ద్వారా ప్రజలకు కావల్సిన రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణం చేస్తూనే నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సెంటర్ లైటింగ్ వెలుగులు కూడ అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే నగరం చుట్టురా అన్ని ప్రధాన రహాదారుల్లో సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేశామన్నారు. మరో 1 కోటి రూపాయల నిధులతో కేబుల్ బ్రిడ్జ్ నుండి సదాశివ్ పల్లి చౌరస్తా వరకు కూడ త్వరలో సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు  స్వప్న వేణు, నేతికుంట యాదయ్య, షరీఫొద్దిన్, బుచ్చిరెడ్డి, నాంపెల్లి శ్రీనివాస్, ఐలేందర్ యాదవ్, గందె మాదవి మహేష్, అంజయ్య, అనూప్ కుమార్, పిట్టల వినోద శ్రీనివాస్, వంగల శ్రీదేవి పవన్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బస్ సమీ తదితరులు పాల్గొన్నారు.