కేశవపట్నం, వీణవంక పోలీస్ స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేసిన పోలీస్ కమీషనర్

కేశవపట్నం, వీణవంక పోలీస్ స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేసిన పోలీస్ కమీషనర్

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు మంగళవారం  కేశవపట్నం, వీణవంక పోలీస్ స్టేషన్లను తనిఖీ చేశారు.

కేశవపట్నం లో...

ఏసీపీ వెంకటరెడ్డి, ఎస్.ఐ. చంద్రశేఖర్ లు పూలమొక్కతో స్వాగతం పలికారు. కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అన్ని స్ధాయిలకు చెందిన పోలీసులతో మాట్లాడి నిర్వహిస్తున్న విధులను అడిగి తెలుసుకున్నారు. రిసెప్షన్ లో ఏలాంటి  ఫిర్యాదులు వస్తున్నాయో తెలుసుకోవడం తోపాటు పరిష్కారం కోసం తీసుకుంటున్న చర్యలను అడిగారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ రికార్డులను సక్రమంగా నిర్వహించాలన్నారు. 5 ఎస్ ప్రోగ్రాంలో భాగంగా పోలీస్ స్టేషన్ల ఆవరణను పరిశుభ్రంగా ఉంచుకుని అహ్లాదకరమైన వాతావరణ ఏర్పాటు చేయాలని చెప్పారు. సిసి కెమెరాలు పనితీరును అడిగి తెలుసుకున్నారు.. పనిచేయని సిసి కెమెరాలను వెంటనే మరమ్మతు చేయించాలని ఆదేశించారు. నేరాల ఛేదన, నియంత్రణలో కీలకపాత్ర పోషించే సిసి కెమెరాల పనితీరును ప్రతిరోజు పరిశీలించాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఒ మరియు సిబ్బందిని అభినందించారు.
   
ఈ కార్యక్రమంలో ఏసిపి వెంకట్ రెడ్డి, ఎస్ ఐ చంద్రశేఖర్ లతోపాటుగా సిబ్బంది పాల్గొన్నారు.

వీణవంక లో...

పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు మంగళవారం  వీణవంక పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎసిపి వెంకటరెడ్డి, స్టేషన్ ఎస్ఐ శేఖర్ రెడ్డి లు పూల మొక్కలతో స్వాగతం పలికారు.

ఈ  సందర్బంగా కమీషనర్ మాట్లాడుతూ రికార్డుల నిర్వాహణను క్రమపద్ధతిలో నిర్వహించాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న వివిధ రకాల నేరాలను సమీక్షించారు. వివిధ విభాగాల పనితీరును అడిగి తెలుసుకున్నారు.     
         
అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపేందుకు నిరంతరం తనిఖీలు, దాడులను కొనసాగించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ కు చెందిన సిబ్బందితో సమావేశమై వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకరావాలని చెప్పారు.పోలీస్ స్టేషన్ అధికారి , సిబ్బంది పనితీరుపట్ల సంతృప్తి వ్యక్తం చేసారు.

ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఏసిపి వెంకటరెడ్డి, స్టేషన్ ఎస్.హెచ్.వో శేఖర్ రెడ్డి లతో పాటుగా సిబ్బంది  పాల్గొన్నారు.