తెగిపోయిన రోడ్లను వెంటనే పునరుద్ధరించాలి బిజెపి ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి

తెగిపోయిన రోడ్లను వెంటనే పునరుద్ధరించాలి బిజెపి ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి

ఇల్లందకుంట : ముద్ర భారీ వర్షాల కారణంగా పలు గ్రామాల వెళ్లే రహదారులు తెగిపోవడంతో గ్రామాలకు రాకపోకలు బంద్ అయినాయి అష్టదిగ్బంధంలో ఉన్నటువంటి పాతర్ల పెళ్లి గ్రామానికి రెండు వైపులా గల రహదారి తెగిపోవడంతో గ్రామం లోని ప్రజలు నిత్యవసర వస్తువులు కొనుక్కోవడానికి దారి కరువైందని గ్రామస్తులు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు ప్రజా ప్రతినిధులు అధికారులు తక్షణమే స్పందించి సత్వర రోడ్డు మరవదు చేయాలని కోరుకుంటున్నారు.

పాతర్లపల్లి గ్రామానికి చెందిన బిజెపి మండల ప్రధాన కార్యదర్శి బైరెడ్డి రమణారెడ్డి మాట్లాడుతూ తూతూ మంత్రంగా కాకుండా శాశ్వత రోడ్లను ఏర్పాటు చేయాలని ప్రతి సంవత్సరం వర్షాల వల్ల ఇతర గ్రామాలతో అనుసంధానం తెగిపోతుందని శాశ్వతంగా నాణ్యమైన రోడ్లను నిర్మించాలని అన్నారు నాగంపేట టేకుర్తి గ్రామాల మధ్య గల రోడ్డు వర్షానికి తెగిపోవడంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి అలాగే చిన్నకోమటి పల్లి శాయంపేట గ్రామాల మధ్య గల రోడ్డు తెగిపోవడంతో జమ్మికుంట కు వచ్చేవారు ఇల్లందకుంట మీదుగా రావాల్సి వస్తుందని అన్నారు. ప్రజాప్రతినిధులు అధికారులు తక్షణమే స్పందించి రోడ్లను త్వరితగతిన పూర్తి చేసి రవాణా వ్యవస్థను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.