ఘనంగా బక్రీద్ వేడుకలు 

ఘనంగా బక్రీద్ వేడుకలు 
  • వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యె డా. సంజయ్ కుమార్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలో బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని పలు ఈద్గాలు, మసీద్ ల వద్ద ముస్లింలు సాముహిక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్బంగా జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్ కీలలో జరిగిన వేడుకల్లో పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ఎస్పి ఎగ్గడి భాస్కర్ ఆదేశాల్ మేరకు డిఎస్పీ ప్రకాష్, పట్టణ సిఐ నటేష్ బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మత గురువు మౌలానా ముస్తాక్ అహమద్, హాఫిజ్ అబ్రార్, సెంట్రల్ ముస్లిం కమిటి అధ్యక్షుడు ఎంఎ భారి, సయ్యద్ జమాల్ హ్యమాద్, సత్తార్, ఖాజా లియాకతలి మోసిన్, మన్సూర్ తదితరులు పాల్గొన్నారు.