గొప్ప విప్లవకారుడు భగత్ సింగ్

గొప్ప విప్లవకారుడు భగత్ సింగ్

ఆప్ తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ దిడ్డి సుధాకర్
ముద్ర, ముషీరాబాద్: భగత్ సింగ్ ఒక గొప్ప విప్లవకారుడని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ దిడ్డి సుధాకర్ కొనియాడారు. భారత స్వాతంత్ర విప్లవ వీరులు భగత్ సింగ్, శివరామ్ హరి రాజ్ గురు, సుఖ్ దేవ్ థాపర్ 92 వ వర్ధంతి ని పురస్కరించుకొని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో లిబర్టీ నుండి దోమలగూడ లోని సర్దార్ భగత్ సింగ్ విగ్రహం వరకు కాగడాల ప్రదర్శన నిర్వహించారు.  భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ చిత్రపటాలకు ఆప్ నాయకులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ బ్రిటీష్ పాలనను కూలదోయడంతోపాటు భారతీయ సమాజంలో సోషలిస్టు పునర్నిర్మాణం జరగాలని, రాజకీయ అధికారాన్ని రైతులు, కార్మికులు, విద్యార్ధి, యువత స్వాధీనం చేసుకోవాలని భగత్ సింగ్ గ్రహించాడని తెలిపారు.

స్వాతంత్రం, స్వేచ్ఛ, సమానత్వం మరియు న్యాయం కోసం లక్షలాది మందిని చేరుకోవడానికి ఒక విప్లవకారుడిగా భగత్ సింగ్ సారధ్యం వహించిన పోరాటం నేటికీ దేశానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిపోయిందని అయన గుర్తు చేసారు. ప్రస్తుతం దేశంలో మోడీ ఫాసిస్ట్ పాలనా కొనసాగుతుందని, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాదాన్ని మోడీ సర్కార్ నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. భగత్ సింగ్ సారథ్యం వహించిన పోరాటాల స్ఫూర్తితోనే మోడీ ఫాసిస్ట్ పాలన కూలదోస్తామని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటామని  తెలిపారు. బుర్ర రాము గౌడ్ మాట్లాడుతూ భగత్ సింగ్ చిన్న వయసులోనే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతరేకంగా జరిగిన పోరాటాల్లో పాల్గొన్నాడని, విప్లవకారుడిగా దోపిడీ రహిత సమాజం కోసం ఉద్యమించాడని తెలిపారు. శోభన్ భూక్యా మాట్లాడుతూ సమానత్వం, న్యాయం, మత సామరస్యం, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా విస్తృత పోరాటానికి సంబంధించిన అతని ఆలోచనలు నేటి సమాజానికి గొప్ప బలాన్ని, ప్రేరణను ఇస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆప్ నాయకులు ఆఫస,  డా.హరి చరణ్, టి. రాకేష్ సింగ్, గఫార్, పరీక్షణ్, రమేష్, శ్రీనివాస్, మజీద్, ఆఫ్జాల్, తేజ, మాలోతు సురేష్, సర్దార్ రణ్వీర్ సింగ్, ప్రవీణ్ యాదవ్  తదితరులు పాల్గొన్నారు