సీఎం కేసీఆర్ చిత్రపటానికి వీఆర్ఏల పాలాభిషేకం

సీఎం కేసీఆర్ చిత్రపటానికి వీఆర్ఏల పాలాభిషేకం

కేసముద్రం, ముద్ర: వీఆర్ఏల సర్వీసును క్రమబద్ధీకరించాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించడం పట్ల హర్షం ప్రకటిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల తహాసిల్దార్ కార్యాలయ ఆవరణలో వీఆర్ఏలు శుక్రవారం పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వీఆర్ఏల జేఏసీ చైర్మన్ రమాదేవి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తమ సేవలను గుర్తించి, సర్వీసు రెగ్యులరైజేషన్తోపాటు, పే స్కేల్ అమలు, వీఆర్ఏ వారసులకు ఉద్యోగ అవకాశం కల్పించడానికి విధివిధానాలను రూపొందించాలని సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ కు ఆదేశాలు జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు ప్రభాకర్, బుచ్చయ్య, స్వప్న, సరిత, శ్వేత, విమల, చంద్రకళ, సమ్మయ్య, భాస్కర్, యుగేందర్, సారయ్య, నాగేందర్, మంగిలాల్, అఖిల్, చంద్రయ్య, వీరన్న, రాములు, వెంకన్న పాల్గొన్నారు.