సీఎం కప్ జిల్లా స్థాయి పోటీల్లో ఇనుగుర్తి క్రీడాకారుల ప్రతిభ

సీఎం కప్ జిల్లా స్థాయి పోటీల్లో ఇనుగుర్తి క్రీడాకారుల ప్రతిభ

కేసముద్రం, ముద్ర: సీఎం కప్ క్రీడా పోటీల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా స్థాయిలో నిర్వహించిన బ్యాడ్మింటన్ పోటీల్లో ఇనుగుర్తి మండల క్రీడాకారులు ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచారు. బ్యాడ్మింటన్ డబుల్స్ పోటీల్లో చెందిన పి.రవివర్మ, రంజిత్ జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. అలాగే సింగిల్స్ పోటీల్లో రవి వర్మ తృతీయ స్థానంలో నిలిచారు. ఇటీవల నూతన మండలంగా ఏర్పడ్డ ఇనుగుర్తి తరపున జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొని ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలవడం పట్ల ఇనుగుర్తిలో హర్షం వ్యక్తం అవుతోంది.