ముస్లిం డిక్లరేషన్ను మేనిఫెస్టోలో పెట్టిన పార్టీకే ముస్లింల మద్దతు

ముస్లిం డిక్లరేషన్ను మేనిఫెస్టోలో పెట్టిన పార్టీకే ముస్లింల మద్దతు

శంకరపట్నం ముద్ర అక్టోబర్ 12: శంకరపట్నం మండలంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ముస్లింల డిమాండ్లను తన మేనిఫెస్టోలో తమ మద్దతు ఇస్తామన్నారు . ఈ సమావేశంలో పాల్గొన్న విద్యార్థి నాయకుడు సలీం పాషా మాట్లాడుతూ రంజాన్ కు ఇఫ్తార్ విందులు ఇచ్చి, టోపిలి పెట్టుకుంటే సరిపోదని ముస్లింల డిమాండ్లను నెరవేర్చే దిశగా ప్రభుత్వం పాటుపడాలని అన్నారు . 22 డిమాండ్లతో తెలంగాణ ముస్లిం డిక్లరేషన్ బుక్ లెట్ ను విడుదల చేశారు. రాష్ట్రంలో 60 లక్షల మంది ఉన్న ముస్లింలు 40 నియోజకవర్గాల్లో తమ ప్రభావం చూపెడతామని అన్నారు. ముస్లింలకు మైనార్టీ బందు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో స్కైబాల్,సయ్యద్ నవాజ్,రహీం,ఆరిఫ్,జహంగీర్,ఇసాముద్దీన్, అయాన్,జాకీర్ పాల్గొన్నారు.