ఇసుక లారీ బోల్తా

ఇసుక లారీ బోల్తా

వీణవంక, ముద్ర: వీణవంక మండలంలోని కిష్టంపేట గ్రామంలో  డ్రైవర్ అజాగ్రత్తతో ఇసుక లారీ బోల్తా పడింది. లారీ రాంగ్ రూట్లో వచ్చి కుక్కను తప్పించబోయి బోల్తా పడింది. ఈ  సంఘటనలో డ్రైవర్ కు గాయాలయ్యాయి. దీంతో స్థానికుల సహాయంతో డ్రైవర్​ను  అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. స్థానికుల వివరాల ప్రకారం ....చల్లూరు ఇసుక రీచ్ నుండి జమ్మికుంట వైపునకు ఓవర్ లోడ్ తో ఇసుక లారీ రాంగ్ రూట్లో వచ్చి కుక్కను తప్పించబోయి రోడ్డు పక్కన  బోల్తా పడింది. లారీ వెళ్తున్న సందర్భంలో స్థానికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.  లారీ బోల్తా పడడంతో చేతి పంపు,  నల్లా  పైపులు దెబ్బతిన్నాయని గ్రామానికి చెందిన పురంశెట్టి రవి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.