ధాన్యం కొనుగోలు పారదర్శకంగా నిర్వహించండి: సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి 

ధాన్యం కొనుగోలు పారదర్శకంగా నిర్వహించండి: సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి 

సిద్దిపేట : ముద్ర ప్రతినిధి: సిద్దిపేటలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) పి. శ్రీనివాస్ రెడ్డి  వరిధాన్యం సేకరన పై అధికారులతో , మిల్లర్ల ప్రతినిధులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్  మాట్లాడుతూ, రైతు ఏ దశలోనూ ఇబ్బందులకు గురికాకుండా, పూర్తి పారదర్శకంగా ధాన్యం సేకరణ జరగాలన్నారు. నాణ్యతా ప్రమాణాలకు లోబడి ధాన్యం తీసుకువచ్చే రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మేరకు పూర్తి స్థాయిలో మద్దతు ధర అందేలా చూడాల్సిందిగా ఆదేశించారు. జిల్లాలో ఈ యాసంగి లో సుమారు 3.31 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి పంట సాగు చేయడం జరిగింది, మొత్తం దిగుబడి 7,97,219 మెట్రిక్ టన్నుల ధాన్యం, దీనిలో రైతుల అవసరాలు, ఇతరత్రా బహిరంగ కొనుగోళ్ళు పోను 6,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయుటకై సిద్దంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాలో 416 కొనుగోళ్ళు కేంద్రాల (ఐకెపి-219, ప్యాక్స్- 192, మెప్మ-5)  ద్వారా ధాన్యం కొనుగోలు చేయబడుతందని అన్ని కొనుగోలు కేంద్రాలలో ప్యాడి క్లీనర్లు, వేయింగ్ స్కేల్, మాయిశ్చర్ మీటర్ మరియు టార్పాలిన్లు ఖచ్చితంగా అందుబాటులో ఉండి పనిచేయు స్థితిలో ఉండేలా చూసుకోవాలి.

కేంద్ర నిర్వాహకులు నాణ్యత ప్రమాణాలు గల ధాన్యం కొనుగోలు కేంద్రానికి తెచ్చేలా చైతన్య పరచి రైతులకు ఇబ్బంది కలగకుండా కొనుగోలు కేంద్రాలలో మంచినీటి సదుపాయం, నీడ, తాత్కాలిక మరుగుదొడ్డి, కరెంటు మొదలగు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి.  నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణకు అవసరమైన గన్నీ బ్యాగులను సమకూర్చాలని జిల్లా  పౌర సరఫరా మేనేజర్ను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని వెంటవెంటనే రైస్ మిల్లులకు తరలించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రధానంగా ధాన్యం లోడింగ్, అన్ లోడింగ్ లో జాప్యం జరుగకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే చాలా వరకు సమస్యలను అధిగమించగల్గుతామని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు.  జిల్లాలో ధాన్యం నిలువకై మధ్యంతర గోడౌన్ లను గుర్తించి ఉపయోగించుకోవాలని తెలిపారు. యాసంగి 2021-22 సి. ఎం. ఆర్. ఈ నెలాఖరులోగా పూర్తీ చేయాలన్నారు.


యాసంగి 2021-22 కు సంబంధించి పెండింగ్ లో గల సిఎంఆర్ డెలివరీల  విషయంపై జిల్లాలోని అందరు రైస్ మిల్లర్లతో  సమావేశం నిర్వహించారు.  ఈనెల30లోపు యాసంగి 2021-22 పెండింగ్ ఉన్న  అందరూ మిల్లర్లు తమ సీఎం డెలివరీ పూర్తి చేయాలి, ఎట్టి పరిస్థితులలో గడువు తేదీకి  పొడిగింపు రాదని తెలిపారు. సిఎంఆర్ పెండింగ్ ఉన్న రా రైస్ మిల్లర్లు , యఫ్. సి. ఐ కి రా రైస్ డెలివరీ చేయాలి. ఇదే విధంగా అధిక పెండింగ్ ఉన్న మిల్లర్లు, వేరే మిల్లర్లకు అనగా  100% సిఎంఆర్  పూర్తీ చేసిన వారికి ధాన్యాన్ని ఖచ్చితముగా ట్రాన్స్ఫర్ చేసి సిఎంఆర్  సకాలంలో పూర్తీ చేసి ,అదే విధంగా మిల్లర్లు ఈ  నెలాఖరు వరకు వానాకాలం 2022-23 కు సంబంధించిన  సిఎంఆర్  కాకుండా,  కేవలం యాసంగి 2021-22 ధాన్యం మాత్రమే మర ఆడించి డెలివరీ పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో డి.సి.యస్.ఒ బ్రహ్మా రావు, డి. యం (సి.యస్.సి) హరీష్ ,  డి.సి.వో ఇంచార్జ్ డి.ఆర్.డి.వో. చంద్రమోహన్ రెడ్డి గారు,  డి.యం.వో. రియాజ్ , వ్యవసాయ, రవాణా, పౌర  సరఫరా అధికారులు , మిల్లర్ల ప్రతినిధులు, మిల్లర్లు  పాల్గొన్నారు.