బిఆర్ఎస్ అన్నివర్గాల పార్టీ బిఆర్ఎస్ ఇంచార్జి వెంకటశ్వర్లు

బిఆర్ఎస్ అన్నివర్గాల పార్టీ బిఆర్ఎస్ ఇంచార్జి వెంకటశ్వర్లు

తూప్రాన్ :ముద్ర: ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలోని బిఆర్ఎస్ అన్నివర్గాల పార్టీ అని బిఆర్ఎస్ ఇంచార్జి బోడకంటి వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం తూప్రాన్ మున్సిపల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సతీష్ చారి అధ్యక్షతన నిర్వహించిన బిఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో  జడ్పీ చైర్ పర్సన్ హేమలత గౌడ్, ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ లు భూమ్ రెడ్డి, ఎలక్షన్ రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ సంక్షేమ పథకాలే బిఆర్ఎస్ ముఖ్య ఉద్దేశం అన్నారు. ప్రజల కోసం బిఆర్ఎస్ పని చేస్తుంటే బీజేపీ ఎగవేత దారులకు కోసం పనిచేస్తుందని అద్దెవా చేశారు.ప్రజలకు తోడు కెసిఆర్ ఉంటే కేడిలకు మోడీ తోడు ఉంటున్నారని అన్నారు. దేశంలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు అవుతున్నాయని అన్నారు. రాబోయే రోజులలో దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలు అమలుపర్చి  దేశ ప్రజలకు న్యాయం చేస్తారని ఆశభావం వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, పాక్స్ చైర్మన్ బాలకృష్ణ రెడ్డి, కౌన్సిలర్లు, బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యకర్తలకు అన్యాయం బిఆర్ఎస్ పార్టీలో నిజమైన ఉద్యమ కారులు, సామాన్య కార్యకర్తలను పట్టించుకునే పరిస్థితి లేదని  ముందు నుండి జెండాలు మోసిన కార్యకర్తలను పక్కన పెట్టడం సరైన విధానం కాదని మాజీ కార్పొరేషన్ చైర్మన్ బూంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి నుండి పార్టీ కోసం కష్టపడిన వారికీ బిఆర్ఎస్ లో ప్రాధాన్యత లేదని పార్టీ కోసం కష్టపడినా వారు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్నమొన్న పార్టీలోకి వచ్చిన వారే పెత్తనం చేలాఇస్తున్నారని కౌన్సిలర్ శ్రీశైలం గౌడ్, పలువురు ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేసారు. కార్యకర్తలను పట్టించుకోకపోతే నష్టం తప్పదని ఉద్యమకారులు పరోక్షంగా హెచ్చరించారు.