500రూపాయలు రివార్డ్ ప్రకటించిన సిపి

500రూపాయలు రివార్డ్ ప్రకటించిన సిపి

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి : గురువారం  పదవ తరగతి పరీక్షా కేంద్రం లో కి సెల్ ఫోన్ తీసుకొని వెళుతున్న  రాచకొండ సీపీ డి.ఎస్.చౌహాన్ ను  అక్క‌డ విధులు నిర్వ‌హిస్తున్న లేడీ కానిస్టేబుల్ అడ్డుకున్నారు. సెల్ ఫోన్ తో పరీక్షా కేంద్రం లో కి అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. విధులు నిర్వహిస్తున ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ కు చెందినా  కల్పనా అనే మహిళా కానిస్టేబుల్ అడ్డుకున్నారు. దీనితో అక్కడ ఉన్న ఉన్నతాధికారులు అంతా షాక్ కు గురయ్యారు.

దీనితో చేసేదేమి లేక సీపీ చౌహన్ మొబైల్ ను మహిళా కానిస్టేబుల్ కు ఇచ్చి పరీక్ష కేంద్రంలోకి వెళ్లిపోయారు. ఆ తరువాత బయటకు వచ్చిన సీపీ  చౌహాన్ ఆ మహిళా కానిస్టేబుల్ ను అభినందించి రివార్డ్ కూడా అందజేశారు. ఎవరినీ కూడా ఫోన్ తో అనుమతించవద్దని సీపీ సూచించారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనంతరం సీపీ మాట్లాడుతూ.."పదో తరగతి పరీక్షల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పోలీస్ డిపార్ట్ మెంట్ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. సెల్ ఫోన్ లోపలి తీసుకెళ్లేందుకు ఎవరికీ అనుమతి లేదు. ర్యాంకుకు అతీతంగా సెల్ ఫోన్ బయటే ఉంచాలి. నేను పరీక్షా కేంద్రంలోకి వెళ్లే ముందు మహిళా కానిస్టేబుల్ నా ఫోన్ తీసుకున్నారు. ఆమె చేసిన పనికి నేను ప్రశంశిస్తున్నా. కానిస్టేబుల్ కల్పన గారికి రూ.500 రివార్డు ప్రకటిస్తున్నా అని రాచకొండ సీపీ చౌహన్ ప్రకటించారు.