ప్రతిపక్షాలకు విమర్శించే హక్కు లేదు

ప్రతిపక్షాలకు విమర్శించే హక్కు లేదు
Husnabad MLA Voditela Satish Kumar
  • నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది
  • బిజెపి ఎంపీ బండి సంజయ్ చిగురుమామిడి మండలానికి ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలి-హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్

చిగురుమామిడి ముద్ర న్యూస్: రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ప్రతిపక్షాలకు లేదని ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ అన్నారు.   ఈనెల 20న హుస్నాబాద్ లో నిర్వహించే కేటీఆర్ భారీ బహిరంగ సభకు జన సమీకరణ కోసం మంగళవారం ఎమ్మెల్యే  సతీష్ కుమార్ చిగురుమామిడి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ... ప్రతిపక్ష నాయకులు అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మమ్మల్ని విమర్శించే నాయకులు మీ హాయంలో ఏం చేశారో చెప్పాలని  నిలదీశారు. కాంగ్రెస్ ,టిడిపి పాలనలో గ్రామాల నుండి బ్రతుకుతెరువు కొరకు వలస పోయారని మా ఎనిమిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వలస పోయిన వారు గ్రామాలకు తిరిగి వచ్చి సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు. రైతుల కోసం అనేక అభివృద్ధి పనులు చేపట్టామని రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు, సాగునీరు ప్రాజెక్టులు ఇలా అనేకం చేశామని మీ హయాంలో ఎందుకు చేయలేకపోయారని  ప్రశ్నించారు.

గోదారి జలాలను చిగురుమామిడి మండలానికి తీసుకువచ్చిన ఘనత మాదే అన్నారు. మమ్మల్ని విమర్శించే ప్రస్తుత  ఎంపీ బండి సంజయ్, మాజీ  ఎంపీ పొన్నం ప్రభాకర్ మీరు చిగురుమామిడి మండలానికి ఎన్ని నిధులు తీసుకువచ్చారో చెప్పాలని సవాల్ విసిరారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మనకు పోటీ ఎవరు లేరని,  సీఎం కెసిఆర్ నాయకత్వంలో   వందల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోగలిగామని, ప్రజలు బీఆర్ఎస్ వెంబడే ఉన్నారని అన్నారు. ఎనిమిదేళ్ల బిఆర్ఎస్ పాలలో చేసిన అభివృద్ధి పనులను బీఆర్ఎస్ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి  తెలుపాలని కోరారు .హుస్నాబాద్ లో ఈనెల 20న జరిగే కేటీఆర్ బహిరంగ సభకు మండలం నుండి భారీ ఎత్తున కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి, జెడ్పిటిసి గీకురు రవీందర్, సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి, సీనియర్ నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, పన్యాల శ్యాంసుందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ బేతి రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్ పర్సన్ రామోజు రజిత కృష్ణమాచారి, టిఆర్ఎస్ మండలాధ్యక్షులు మామిడి అంజయ్య ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.