స్నేహితుడి దారుణ హత్య

 స్నేహితుడి దారుణ హత్య

అబ్దుల్లాపూర్‌మెట్‌: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ ప్రాంతంలో  హత్య జరిగింది.  తాను ప్రేమిస్తున్న యువతితో చనువుగా ఉంటున్నాడని నవీన్‌ అనే యువకుడిని మరో యువకుడు హరికృష్ణ దారుణంగా హత్య చేశాడు. ఈ నెల 17వ తేదీన నవీన్‌ను హత్య చేసిన హరికృష్ణ.. అబ్దుల్లాపూర్‌మెట్‌ సమీంలోని గుట్టల్లో పడేశాడు. నవీన్‌ కనిపించడం లేదంటూ ఈ నెల 22న తల్లిదండ్రులు నార్కట్‌పల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. మృతుడు నవీన్ నల్గొండ జిల్లాలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో చదువుతున్నాడు. ఈనెల 17న సాయంత్రం ఫోన్ చేసి పార్టీ ఉందని ఓఆర్ఆర్ వద్దకు రావాలని పిలిచిన హరికృష్ణ.. నవీన్‌ను చెట్లపొదల్లోకి తీసుకెళ్లి హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు సమాచారం. నవీన్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. హత్య ఎక్కడ చేశారు.. ఎవరెవరు భాగం పంచుకున్నారు.. అన్న కోణం లో నిందితుడు హరికృష్ణను పోలీసులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది.