అక్రమంగా తరలిస్తున్న గోవులను అడ్డుకున్న ధ్యాన్ ఫౌండేషన్ గోశాల సభ్యులు.

అక్రమంగా తరలిస్తున్న గోవులను అడ్డుకున్న ధ్యాన్ ఫౌండేషన్ గోశాల సభ్యులు.
Dhyan Foundation Goshala members stopped the illegal transportation of cows

శంషాబాద్.ముద్ర: తెలంగాణ రాష్ట్ర గోహత్య నిషేధం జంతు సంరక్షణ చట్టానికి వ్యతిరేకంగా నిబంధనలకు విరుద్ధంగా ఒక కంటైనర్ వాహనంలో 74 ఆవులు ఎద్దులను తీసుకొని బహదూర్ పూర కబేలా హౌస్ కు తరలిస్తున్న సమయంలో ధ్యాన్ ఫౌండేషన్ గోశాల సభ్యులు అడ్డుకొని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసులకు సమాచారం అందజేశారు. వీటిలో సుమారు 8 ఆవులు చనిపోయి ఉన్నాయి.

అక్రమంగా తరలిస్తున్న గోవులను ఎద్దులను పునరావాసం కోసం శంషాబాద్ ధ్యాన్ ఫౌండేషన్ గోశాలకు తరలించారు. అక్కడ వాలంటీర్లు ఆవులకు ఎద్దులకు చికిత్సలు అందజేశారు. అక్టోబర్ 2021 లో ప్రారంభమైన ధ్యాన్ ఫౌండేషన్ గోశాలకు గత నాలుగు నెలలో పహాడీ షరీఫ్, రాజేంద్రనగర్, ఆదిభట్ల,శంషాబాద్ పోలీస్ స్టేషన్ ల నుండి సుమారుగా 400 పైగా ఆవులు ఎద్దులు వచ్చాయి.