ఓటు సద్వినియోగం ఓ బాధ్యత. 

ఓటు సద్వినియోగం ఓ బాధ్యత. 
  • షాద్ నగర్ మున్సిపల్ కమిషనర్ వెంకన్న. 
  • రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఓటర్ అవగాహన కార్యక్రమం. 
  • షాద్ నగర్ మినీ స్టేడియం నుంచి ప్రారంభమైన 5K రన్. 

షాద్ నగర్, ముద్ర : ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ రానున్న ఎన్నికల్లో ఓటు సద్వినియోగం చేసుకోవడం తమ బాధ్యతగా భావించాలని షాద్ నగర్ మున్సిపల్ కమిషనర్ వెంకన్న అన్నారు. షాద్ నగర్ ఆర్డిఓ కార్యాలయం ఆధ్వర్యంలో ఓటర్ అవగాహన  కార్యక్రమంపై 5k రన్ నిర్వహించారు. షాద్నగర్ పట్టణంలోని మినీ స్టేడియం నుంచి పట్టణ ముఖ్య కూడలి వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్డిఓ వెంకట్ మాధవులు రావు, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, ఫరూక్ నగర్ తహసిల్దార్ పార్థసారథి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ... 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువైందని, సమయం వచ్చినప్పుడు తమ వజ్రాయుద్దాన్ని వినియోగించి సమర్థమంతమైన నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. ప్రతి ఓటు ఎంతో విలువైనదని దానిని అందరూ సద్వినియోగం చేసుకోవాలనిఓటు హక్కు ప్రయోజనాన్ని వివరించారు.అనంతరం పట్టణ ముఖ్య కూడలిలో మానవహారం నిర్వహించి ఓటర్ల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, ఆయా శాఖల అధికారులుతదితరులు పాల్గొన్నారు.