చలివేంద్రాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి
తుర్కపల్లి, ముద్ర :చలివేంద్రాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తుర్కపల్లి మండల కేంద్రంలోని ఆటో స్టాండ్ వద్ద గట్టు నిఖిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ఎంపీపీ భూక్య సుశీల రవీందర్ నాయక్ ప్రారంభించారు. ఎండాకాలందృష్టిలో ఉంచుకొనిప్రజల దాహార్తి తీర్చడానికిగట్టు నిఖిల్ ఫౌండేషన్ ద్వారా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమని గట్టు నిఖిల్ ఫౌండేషన్ చైర్మన్ గట్టు తేజస్వి నిఖిల్ ని కొనియాడారు.. ఈ కార్యక్రమంలో యువకులు సీతరాజు, మహాదేవుని భాను, లక్ష్మీకాంత్, భాస్కర్, శ్రీకాంత్, శ్రీను, శ్రీకాంత్, రాజు, బాబు తదితరులు పాల్గొన్నారు.