పేపర్ లీకులపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి

  • లక్షలాది నిరుద్యోగులతో చెలగాటమాడుతున్న కెసిఆర్
  • నోటిఫికేషన్లు వేస్తారు  పేపర్ లీకులు చేస్తారు
  • బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : టి ఎస్ పి ఎస్ సి పేపర్ల లీక్ వ్యవహారాన్ని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా పోలీసులు జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డితో సహా బిజెపి శ్రేణులు అందర్నీ అరెస్టు చేసింది. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ పేపర్ లీకుపై శాంతియుతంగా ఆందోళన చేపడుతుంటే అక్రమంగా బిజెపి శ్రేణులు అందరినీ అరెస్టుచేయడంఅప్రజాస్వామికమన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని, ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్టు చేయడం నిరంకుశ  కెసిఆర్ ప్రభుత్వానికే చెల్లిందన్నారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 8 ఏళ్ల తర్వాత కెసిఆర్ ప్రభుత్వంనోటిఫికేషన్లు ఇచ్చినట్టే ఇచ్చి పేపర్ లీకులు జరిగిందని సిగ్గు లేకుండాపరీక్షలను రద్దుచేసి  చేతులు దులుపుకుందన్నారు. ప్రభుత్వానికి నిరుద్యోగుల బాధ , అవస్థలు పట్టనట్టుగా వ్యవహరిస్తుందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటినుండి లక్షలాదిమంది నిరుద్యోగుల జీవితాలతో కెసిఆర్ ప్రభుత్వం చెలగాటమాడుతుందని ఆయన విమర్శించారు.

కనీసం 2018 వ సంవత్సర ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ రూ.3016 కూడా నిలుపుకోలేని దౌర్భాగ్య స్థితిలో కెసిఆర్ ప్రభుత్వం ఉండడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రవ్యాప్తంగా టిఎస్పిఎస్సి లో 33 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగుల కోసం రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. ఉద్యోగాల మీద ఆశతో ప్రైవేట్ కోచింగ్ సెంటర్ లో వేల రూపాయలు వెచ్చించి, శిక్షణ తీసుకొని రేయింబవళ్లు చదువుకోవడానికి అనేక కష్టనష్టాలు పడిన నిరుద్యోగుల శ్రమ పేపర్ లికు వ్యవహారంతో బూడిదల పోసిన పన్నీరులా మారిందన్నారు. పరీక్షల రద్దుతో లక్షలాదిమంది నిరుద్యోగుల జీవితాలు రోడ్డున పడ్డాయని, అయినా కూడా కెసిఆర్ ప్రభుత్వం ఈ విషయంలో స్పందించకపోవడం దారణమన్నారు. ప్రభుత్వం సైలెంట్ గా ఉండడం చూస్తుంటే నిరుద్యోగుల సమస్య పట్ల ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి ఉందో స్పష్టంగా అర్థమవుతుందన్నారు. కుటుంబం కోసం కెసిఆర్ పాలన గాలికి వదిలేశారని , దీనివల్లే రాష్ట్రంలో అనేక సంఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. చేతకాని, దద్దమ్మ ,ఫెయిల్యూర్ ప్రభుత్వం కెసిఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వమే నని ఆయన విమర్శించారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు కవిత  అరెస్టు కాకూడదు అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మంత్రులు , ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఢిల్లీకి వెళ్లి మకాం వేశారని, టిఎస్పిఎస్సి లీక్ సంఘటనలో లక్షలాదిమందిఉద్యోగ అభ్యర్థుల జీవితాలు రోడ్డున పడితే ప్రభుత్వ పెద్దలకి ఏ ఒక్కరికి పట్టింపు లేకపోవడం దారుణమన్నారు.తెలంగాణ లో ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్న స్పందించని ముఖ్యమంత్రి,  మంత్రులు రాష్ట్రాన్ని వదిలి దేశ రాజకీయాలు అంటూ డ్రామాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నిరుద్యోగుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకొని, సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని, నష్టపోయిన నిరుద్యోగులను ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ డి శంకర్, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ కళ్లెం వాసుదేవ రెడ్డి బత్తుల లక్ష్మీనారాయణ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు, జిల్లా ఆఫీస్ సెక్రెటరీ మాడుగుల ప్రవీణ్, జిల్లా మీడియా కన్వీనర్ కటకంలోకేష్, జిల్లా అధికార ప్రతినిధులు బొంతల కళ్యాణ్ చంద్ర జానపట్ల స్వామి ఎడమ సత్యనారాయణ రెడ్డి జెల్ల సుధాకర్ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ, బండ రమణారెడ్డి,కొలగాని శ్రీనివాస్, దురిశెట్టి అనూప్, నాగసముద్రం ప్రవీణ్,జాడి బాల్రెడ్డి,బల్బీర్ సింగ్, మాడ గౌతమ్ రెడ్డి, పుప్పాల రఘు, మామిడి చైతన్య, ఆవుదుర్తి శ్రీనివాస్, నరహరి లక్ష్మారెడ్డి, పాదం శివరాజ్, కడార్ల రతన్,జీడి మల్లేష్, లక్ష్మణ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.