హైలాండ్ జంక్షన్లలో రూప్ టాప్ హైమాస్ లైట్లు

హైలాండ్ జంక్షన్లలో రూప్ టాప్ హైమాస్ లైట్లు

 నగర వ్యాప్తంగా 500 మినీ హైమాస్ లైట్లు ఏర్పాటు చేశాం:మేయర్ సునీల్ రావు

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : స్మార్ట్ సిటీ మరింత సుంధరంగా, ఆకర్షణీయంగా కనిపించేలా నగరపాలక సంస్థ ద్వారా హైమాస్ లైట్లను ఏర్పాటు చేస్తున్నామని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ నగర అభివృద్ధి లో భాగంగా శుక్రవారం రోజు సాయంత్రం నగర లో 5 చోట్ల రూఫ్ టాప్ హైమాస్ వీది దీపాలను పలువురు కార్పోరేటర్లతో కలిసి మేయర్ యాదగిరి సునీల్ రావు ప్రారంభం చేశారు. మొదటగా నగరంలోని కేసిఆర్ గెస్ట్ హౌజ్ చౌరస్తా హైలాండ్ జంక్షన్ లో స్విచ్ ఆన్ చేసి లైట్లను వెలిగించారు. అనంతరం తెలంగాణ చౌక్ చౌరస్తా హైలాండ్ జంక్షన్ లో రెండు చోట్ల స్విచ్ ఆన్ చేసి రూప్ టాప్ హైమాస్ లైట్లను ప్రారంభించారు. మరో వైపు నగరంలోని ప్రధాన జంక్షన్ అయిన బస్టాండ్ ఇన్ గేట్, జౌట్ గేట్ రెండు చోట్ల రూప్ టాప్ హైమాస్ లైట్లను వెలిగించారు ఈ సంధర్బంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ ఆదేశాల మేరకు అభివృద్ధి లో ఎక్కడ తీసి పోకుండా అన్ని రంగాల్లో పూర్తిగా అభివృద్ధి చెందాలనే సంకల్పంతో కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ నెల అంతా చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేసి చాలా ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలకే కేటాయించామని స్పష్టం చేశారు. ప్రతి రోజు ప్రారంభోత్సవాల జాతర కొనసాగిస్తున్నట్లు తెలిపారు. నగరంలో ప్రాజెక్టుల వారిగా చేపట్టిన అభివృద్ధి పనులన్ని పూర్తి చేసి ప్రజల వద్దకు మల్లీ దీవెలన కోసం వెల్లడం జరుగుతుందన్నారు. నగరం మరింత సుంధరంగా కనిపించేందుకు నగరంలోని హైలాండ్ జంక్షన్లలో రూప్ టాప్ హైమాస్ లైట్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణీ హరిశంకర్, కార్పోరేటర్లు వాల రమణ రావు, బుచ్చిరెడ్జి, తోట రాములు, సరిల్ల ప్రసాద్, గందె మాధవి మహేష్, ఎడ్ల సరిత అశోక్, షకీరా అంజూమ్ బర్కత్ అలీ, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బస్ సమీ, మాజీ కార్పోరేటర్ ఏవీ రమణ రావు తదితరులు పాల్గొన్నారు.