ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రంపై అవగాహన

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రంపై అవగాహన

ముద్ర న్యూస్: గన్నేరువరం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో శుక్రవారం సర్పంచ్ పుల్లల లక్ష్మి లక్ష్మణ్ ,తాసిల్దార్ అనంతరెడ్డి,ఏఈఓ ప్రశాంత్ ఆధ్వర్యంలో ఎన్నికల ఓటింగ్ యంత్రం (ఈవీఎం)పై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఓటర్లకు నమూనా ఓటింగ్ యంత్రం (ఈవీఎం)పై కంట్రోల్ యూనిట్ , బ్యాలెట్ యూనిట్, వివి ఫ్యాట్ లు పని చేసే విధానంపై అవగాహన కల్పించారు. స్వయంగా ఓటు వేసి అనుమానాలను నివృతి చేసుకునేందుకు డెమో ఈవీఎంలు ఏర్పాటు చేశారు.

ఇట్టి అవకాశాన్ని ప్రజలు ,ఓటర్లు సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ పుల్లెల లక్ష్మి లక్ష్మణ్ తాహాసిల్దార్ అనంతరెడ్డి,నాయకులు సుధాకర్ కోరారు. ఎలక్ట్రానిక్ ఈవీఎంలపై అనుమానాలపై ఏఈఓ ప్రశాంత్ నివృత్తి చేశారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ మనోజ్ , గ్రామస్తులు రామంచ ఈదయ్య, వేదిర పరశురాం, బొడ్డు శ్రీనివాస్, పాశం ప్రభాకర్, సంజీవ్, దేశరాజ్ కనకయ్య, బుర్ర కృష్ణ, బుర్ర నరేష్ ,రామంచ మల్లేశం, అంజయ్య, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.