న్యూజెర్సీలో 10న  తెలుగు పీపుల్ ఫౌండేషన్ వార్షిక సభ

న్యూజెర్సీలో 10న  తెలుగు పీపుల్ ఫౌండేషన్ వార్షిక సభ

ముద్ర ప్రత్యేక ప్రతినిధి,న్యూజెర్సీ: తెలుగు పీపుల్ ఫౌండేషన్ 15వ వార్షిక సభ అమెరికా కాలమానం ప్రకారం డిసెంబర్ 10వ తేదీన న్యూ జెర్సీలోని కింగ్ జార్జెస్ పోస్టు రోడ్డులో గల రాయల్ ఆల్ బర్ట్స్ ప్యాలెస్ లో జరుగుతుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో తెలుగు పీపుల్ ఫౌండేషన్ అందించిన స్కాలర్  షిప్స్ తో తమ కెరీర్ ను తీర్చిదిద్దుకున్న వందలాది మంది స్టూడెంట్స్ సక్సెస్ స్టోరీస్ ని సెలబ్రేట్ చేసుకుంటారు.

ఈ ఉత్సవంలో అనేకమంది పాల్గొంటున్నారు. ప్రముఖ మిమిక్రీ కళాకారుడు మిమిక్రీ రమేష్, గాయకులు సుమంగళి, సుందరి ములకలూరి, ప్రసాద్ సింహాద్రి, అర్జున్ ఆడపల్లి, యాంకర్ శ్రీలక్ష్మి కులకర్ణి తదితరులతో సాంస్కృతిక విభావరి ఉంటుందని  కార్యక్రమ కన్వీనర్ బోయపాటి అరవింద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎటువంటి ఫీజు లేదని, ఆసక్తి గల వారందరూ పాల్గొనవచ్చునని అరవింద్ పేర్కొన్నారు.