జపాన్ లో ఎయిర్ పోర్టులోనే కాలిన విమానం అయిదుగురు సిబ్బంది దుర్మరణం

జపాన్ లో ఎయిర్ పోర్టులోనే కాలిన విమానం  అయిదుగురు సిబ్బంది దుర్మరణం

ముద్ర సెంట్రల్ డెస్క్: జపాన్ దేశం టోక్యో నగరంలోని హనెడా విమానాశ్రయంలో రన్ వేపై ఒక ప్రయాణికుల విమానం, జపాన్ కోస్ట్ గార్డ్ విమానం ఢీకొన్న ప్రమాదంలో అయిదుగురు సిబ్బంది మరణించారు. నూతన ఆంగ్ల సంవత్సరాదిలో పెను భూకంపంతో విలవిల్లాడిన జపాన్ లో రెండో రోజున ఈ విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విమానంలో ప్రయాణిస్తున్న 379 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని, అలాగే కోస్ట్ గార్డ్ విమానం పైలట్ కూడా తప్పించుకున్నారని, అయిదుగురు సిబ్బంది మరణించారని జపాన్ రవాణా మంత్రి టెట్సువో సైటో ధ్రువీకరించారు. రన్ వే పై రెండు విమానాలు ఢీకొనడంతో  మంటలు చెలరేగాయి. 
హనేడా జపాన్‌లోని అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఒకటి మరియు చాలా మంది ప్రజలు నూతన సంవత్సర సెలవుల్లో ప్రయాణిస్తారు.  పశ్చిమ జపాన్‌లో వరుస భూకంపాలు సంభవించిన ఒక రోజు తర్వాత ఈ సంఘటన జరిగింది. ఈ విపత్తులో ప్రభావితమైన నివాసితులకు సహాయ సామగ్రిని అందించడానికి కోస్ట్ గార్డ్ విమానం నీగాటాకు వెళ్లాల్సివుందని అధికారులు తెలిపారు.