నిర్మల్ లో భారత్ రైస్ అమ్మకాలు ప్రారంభం

నిర్మల్ లో భారత్ రైస్ అమ్మకాలు ప్రారంభం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ రైస్ అమ్మకాలు నిర్మల్ లో శుక్రవారం ప్రారంభం అయ్యాయి. నిర్మల్ లోని సత్యం అండ్ సన్స్ లో ఈ బియ్యం అమ్మకాలు మొదలయ్యాయి. ఎన్ఏఎఫ్ఈడీ, ఎన్‌సీసీఎఫ్, కేంద్రీయ భండార్ సహా అన్ని చైన్ రిటైల్స్‌లో ఈ భారత్ రైస్ లభించనుంది. కిలో రూ.29 రూపాయలకు లభించే ఈ బియ్యం 5,10 కిలోల ప్యాక్‌తో లభిస్తుంది. మొదటి దశలో భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య (నాఫెడ్), జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్యలలో లభించనుంది. నిర్మల్ కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆమెడ శ్రీధర్ మాట్లాడుతూ భారత్ రైస్ కొనుగోలు కోసం వినియోగ దారులు తమ ఆధార్ తో సహా రావాలని సూచించారు. ఒక ఆధార్ పై 10 కేజీ ల బియ్యం బస్తాను రూ.290 చెల్లించి పొందవచ్చని పేర్కొన్నారు.