ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కి చేదు అనుభవం

ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కి చేదు అనుభవం

బాసర మండలం సాలాపుర్ గ్రామంలో ప్రచారం అడ్డుకున్న యువకులు

బాసర,ముద్ర నిర్మల్ జిల్లా బాసర మండలం సాలాపుర్ గ్రామంలో ప్రచారానికి వెళ్ళిన ముదొల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి విఠల్ రెడ్డి కి చేదు అనుభవం ఎదురైంది.. సాలపుర్ గ్రామానికి చెందిన కొందరు యువకులు ఎమ్మెల్యే ను గత తొమ్మిది సంవత్సరాలుగా మా గ్రామాన్ని ఏం అభివృద్ధి చేశారో చెప్పండి అని నిలదీశారు.

మా గ్రామంలో ఇప్పటికీ సరైన తాగునీరు లేదు అని, ఇప్పటివరకు ఒక రోడ్డు, డ్రైనేజీ కూడా నిర్మించలేదు అని అన్నారు.. 2018 ఎలక్షన్ ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యే మళ్ళీ ఇప్పుడే వచ్చారు అని అన్నారు. ఇన్ని రోజులు మా గ్రామం మీకు గుర్తుకు రాలేదా అని నిలదీశారు.. గ్రామ యువకులకు, బీఆర్ఎస్ నాయకులకు మధ్య స్వల్ప దాడి జరిగింది. దాడి లో బీఆర్ ఎస్ నాయకులకు స్వల్ప గాయాలయ్యాయి..