రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి గ్రామంలో కమిటీలు - కలెక్టర్ వరుణ్ రెడ్డి

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి గ్రామంలో కమిటీలు - కలెక్టర్ వరుణ్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి అన్నారు. జిల్లా స్థాయి రోడ్డు భద్రత  కమిటీ - 2023 పై జిల్లా పాలనాధికారి సమావేశం మందిరంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో జనాభా పరంగా , విస్తీర్ణ పరంగా చూసుకుంటే రోడ్డు ప్రమాదాల రేటు చాలా ఎక్కువగా ఉందన్నారు.అంతే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో కూడా చిన్న చిన్న అజాగ్రత్తల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. దీనిని నివారించడానికి స్థానిక సర్పంచ్, ఏఈ, ఎంపీడిఓ, ఎంఆర్ఓ లు కలిసి ఒక కమిటీ గా ఏర్పడి రోడ్డు ప్రమాదాల పై దృష్టి సారించాలన్నారు.

జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ చిన్న జిల్లా అయినప్పటికీ రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయని, గత సంవత్సరాలలో జరిగిన ప్రమాదాల లెక్కలపై రివ్యూ నిర్వహించారు. ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ రాంబాబు,  అడిషనల్ sp కాంతి లాల్ పాటిల్, వివి ధ శాఖల జిల్లా అధికారులు, డీఎస్పీ, ఎస్సై లు,  తదితరులు పాల్గొన్నారు.