బాసర లో నూతన అర్చకులకు శిక్షణ తరగతులు 

బాసర లో నూతన అర్చకులకు శిక్షణ తరగతులు 

బాసర,ముద్ర:-తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ కమిషనర్ ఆదేశాల మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ధూప దీప నైవేద్యం కింద 650 మంది అర్చకులు నూతనంగా ఎంపికయ్యారు. వీరికి నేటినుంచి మూడు రోజులపాటు బాసరలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో విజయరామరాజు తెలిపారు. ఆలయ సమీపంలో ఉన్న డార్మెటరీ భవనంలో ఆలయంలో పనిచేసే వేద పండితులు,వైదిక స్మారఆగమం,శైవ ఆగమం పై తరగతులు ఉంటాయని తెలిపారు.