హోమ్ గార్డ్ కుటుంబానికి బీమా అందజేత

హోమ్ గార్డ్ కుటుంబానికి బీమా అందజేత

ముద్ర ప్రతినిధి, నిర్మల్:నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలానికి చెందిన హోమ్ గార్డ్ నర్సింగ్ రావు కుటుంబానికి రూ. 30 లక్షల బీమా మొత్తాన్ని ఎస్పీ ప్రవీణ్ కుమార్ సోమవారం అందజేశారు. విధి నిర్వహణ నుండి తిరిగి వస్తుండగా గత ఏప్రిల్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. ఆయనకు రావాల్సిన రూ 30 లక్షల బీమా మొత్తాన్ని ఆక్సిస్ బ్యాంక్ ద్వారా అందించారు. మృతుని కుటుంబ సభ్యుల్లో ఒకరికి బాసర ట్రిపుల్ ఐటీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పుంచినట్లు ఎస్పీ తెలిపారు.ఈ కార్యక్రమంలో భైంసా ఏ ఎస్పీ కాంతి లాల్ పాటిల్, పోలీసు అధికారులు,మృతుని కుటుంబ సభ్యులు ప్రియాంక, ప్రణవి పాల్గొన్నారు.