రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి కు రైతుల మొర | Mudra Tv

రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి కు రైతుల మొర | Mudra Tv
  • వెంటనే అధికారులకు ఫోన్ చేసిన రేవంత్
  • ఐదో రోజు పాదయాత్ర ఖమ్మం నుంచి ప్రారంభం

ముద్ర ప్రతినిధి,  ఖమ్మం: టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రారంభించిన హత్ సే హత్ యాత్ర ఐదవ రోజు ఖమ్మం జిల్లాలోని కామేపల్లి మండలం లచ్చ తండా నుంచి ప్రారంభమైంది. విద్యుత్ సమస్యలపై పొన్నెకల్ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద రైతుల ఆందోళన చేస్తుండగా రేవంత్ వారికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా రైతులు తమ కష్టాలను రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. 24 గంటల కరెంటు ఇస్తున్నామని చెప్పి వ్యవసాయానికి కనీసం 5 గంటలు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం  చేశారు. ఏసీడీ చార్జీల భారం మోపుతున్నారని, పంట చేతికి వచ్చే సమయంలో కరెంటు కోతలతో ఇబ్బందులు పడుతున్నామని వారు వివరించారు. వెంటనే స్పందించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్థానిక ఏఈతో ఫోన్ లో మాట్లాడారు. 


రాత్రి పూట వ్యవసాయనికి కరెంట్ ఇస్తే రైతులు ఇబ్బందుకు పడుతున్నారని చెప్పారు. పగలు కరెంట్ ఇస్తే రైతులు ఇబ్బందులు లేకుండా పనులు చేసుకుంటారని తెలిపారు. సమస్య పరిష్కరించకుంటే రాష్ట్ర ప్రధాన కార్యాలయం అయిన విద్యుత్ సౌధ ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం రేవంత్ తన పాదయాత్రను కొనసాగించారు. ఆయనకు జవాన్ భూక్య రమేష్ భార్య రేణుక కలసి వినతి పత్రం ఇచ్చారు. జనవరి 5న విధుల్లో ఉండగా తన భర్త మరణించినట్లు ఆమె తెలిపింది. జీవనాధారం లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. ముగ్గురు పిల్లలు ఉన్నారని తమకు  ఏదైనా ఉపాధి లేదా ఉద్యోగం కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. రేవంత్ వెంట కాంగ్రెస్ రాష్ట్ర , జిల్లా నాయకులు మల్లు రవి,  రాజయ్య,  బలరాం నాయక్, దుర్గ ప్రసాద్, జావిద్ , శ్రీనివాస్ రెడ్డి తదితరులున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర.


మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం లో పూర్తి చేసుకుని ఇల్లందు నియోజకవర్గ లోని ఖమ్మం జిల్లా కామేపల్లి మండలానికి గురువారము రాత్రి  చేరుకుని, శుక్రవారము  లచ్చు తండా నుండి పాద యాత్ర ప్రారంభమైంది.