ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలపై పోరాటాలకు సిద్ధం కావాలి

ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలపై పోరాటాలకు సిద్ధం కావాలి
  • కార్మికుల హక్కుల కోసం సిఐటియు నిరంతర పోరాటం
  • ఆరు గ్యారెంటీలలో గ్రామపంచాయతీ కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వాలి
  • పంచాయితీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం స్పందించాలి
  • సిఐటియు జిల్లా నాయకులు

ముద్ర,పానుగల్:- తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్,వర్కర్స్ యూనియన్,సిఐటియు పాన్గల్ మండల కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశంను పాన్గల్ మండల కేంద్రంలో ఆదివారం గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు సుగ్రీవుడు అధ్యక్షతన నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్& వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు మండ్ల రాజు,జిల్లా కార్యదర్శి సూర్యవంశం రాము పాల్గొని మాట్లాడారు.రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని న్యాయమైన డిమాండ్ల సాధన కోసం 2023 జూలై, ఆగస్టు నెలలో సమ్మె చేస్తున్న సందర్భంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇచ్చిన హామీలు అమలు అమలు చేయాలని అన్నారు.సమ్మే సందర్భంగా అప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు అధికారపాక్షంలో ఉంది కాబట్టి పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, 6 గ్యారెంటీలలో గ్రామపంచాయతీ కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.

మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని, పంచాయతీ కార్మికులకు పని బారిన తగ్గించాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని,కనీస వేతనం 26,000 అమలు చేయాలని అన్నారు. ప్రభుత్వమే 399 రూపాయలతో పోస్ట్ ఆఫీస్ ల ద్వారా 10 లక్షల ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయాలని, ప్రమాదంలో చనిపోయిన కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని,ఎంపీడీవో పరిధిలో ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా తక్షణమే పరిష్కారం చేయాలని  ప్రభుత్వాన్ని కోరారు. సమస్యలను పరిష్కారం చేయని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి ఎన్నికలలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చారని, కొత్తగా ఏర్పాటు అయిన కాంగ్రెస్ ప్రభుత్వం  సమస్యలపై స్పందించాలని అన్నారు. కార్మికుల హక్కుల కోసం కార్మికుల పక్షాన నిలబడే సిఐటియు సంఘం ఉందని, కార్మికులు ఎవరు అధైర్య పడవద్దని,మీ సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఉద్యమిస్తామని ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలపై ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ మండల నాయకులు కిషన్ నాయక్, చంద్రశేఖర్, రంగస్వామి, ఆది హరిజనయా, బాలస్వామి, తిరుపతయ్య, బాలకృష్ణ, శివరాజ్, చందు. అంజిరెడ్డి కృష్ణమ్మ శాంతమ్మ, రాములమ్మ, ఎల్లమ్మ, రెడ్డమ్మ, లాల్ నాయక్, ఎల్లయ్య, మద్దిలేటి, సురేందర్ ,రాముడు, గోవిందు వివిధ గ్రామాలకు సంబంధించిన గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.