రేమొద్దులలో పది పడకల ఆసుపత్రి ప్రారంభం

రేమొద్దులలో పది పడకల ఆసుపత్రి ప్రారంభం
  • తల్లి జ్ఞాపకార్థంగా కూతురు నిర్మించిన ఆసుపత్రి
  • సుమారుగా 80 లక్షలతో నిర్మాణం,అంబులెన్స్ సౌకర్యం

ముద్ర,పానుగల్:-పానగల్ మండల పరిధిలోని రేమద్దుల గ్రామంలో సుమారుగా 80 లక్షల రూపాయలతో నిర్మించిన పది పడకల ఆసుపత్రిని శుక్రవారం గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ డాక్టర్ సురేఖ, జఫ్రి దంపతులు ప్రారంభించారు..డాక్టర్ సురేఖ మాట్లాడుతూ తన తల్లి లక్ష్మి దేవి జ్ఞాపకార్ధంతో  ఆసుపత్రిని నిర్మించడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు అనారోగ్యాలతో ఇబ్బందులు పడుతున్నారని కొన్ని సంఘటనలు తనకు కలిచి వేయడంతో గ్రామంలో ఆసుపత్రిని నిర్మించి పేద ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాన్ని కల్పించాలన్న ఉద్దేశంతోనే 10 పడకల ఆసుపత్రిని నిర్మించడం జరిగిందన్నారు. గ్రామానికి చెందిన ప్రజలతోపాటు సమీప గ్రామాల ప్రజలు కూడా ఆసుపత్రిలో వైద్య సేవలు పొందవచ్చన్నారు.

ఆసుపత్రిలో వైద్య సేవల కోసం ప్రభుత్వానికి అప్పగిస్తు దానిపై పర్యవేక్షణ కొనసాగిస్తామని ఆమె తెలిపారు.జిల్లా కలెక్టర్ తో మాట్లాడడం జరిగిందని  ప్రభుత్వ డాక్టర్లచే వైద్య సేవలు అందించే విధంగా కృషి చెయ్యడం జరుగుతుందన్నారు. గ్రామంలో పాఠశాలల అభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలను అందించడం జరిగిందన్నారు గతంలో పాఠశాలలో రెండు అదనపు గదుల నిర్మాణాలను సొంత ఖర్చులతో నిర్మించడం జరిగిందని అలాగే పాఠశాలలో మౌలిక వసతులను కల్పన కోసం తన వంతుగా ఆర్థిక సహకారం చేయడం జరిగిందన్నారు. త్రాగునీటి కోసం రెండు పాఠశాలలకు మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.డాక్టర్ సురేఖ, జఫ్రి దంపతుల కుమారులు అజయ్,అరుణ్ లు అంబులెన్స్ ను డొనేట్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మంజుల తిరుపతయ్య, గ్రామస్తులు యాదగిరి చారి, ప్రసాద్ రావు,మధుసూదన్ రెడ్డి,గోపాల్ రావు, దామోదర్ రెడ్డి, నిరంజన్, ఉపాధ్యాయ బృందం,వివిధ పార్టీల నాయకులు,గ్రామస్తులు పాల్గొన్నారు.