గుప్పుమంటున్న గుడుంభా 

గుప్పుమంటున్న గుడుంభా 
  • పల్లెల్లో విచ్చలవిడిగా అమ్మకాలు 
  • ఛిద్రమౌతున్న పేద కుటుంబాలు 
  • నిద్రావస్థలో అధికారులు 

మఠంపల్లి, ముద్ర: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో గుడుంబా విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి. గుడుంబాకు వినియోగించే ముడి పదార్ధాలైన బెల్లం,పటిక తెలంగాణా రాష్ట్రానికి సరిహద్దు కావడంతో వ్యాపారులు నాటుపడవలద్వారా,పుట్టిల ద్వారా తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా ఇరురాష్ట్రాల బార్డర్ చెక్ పోస్టుల వద్ద గస్తీ నిర్వహించే అధికారులు కొందరు బెల్లం వ్యాపారులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.కాగా మండలంలోని 29 గ్రామ పంచాయితీలలో గుడుంబా విచ్చలవిడిగా అమ్మకాలు సాగుతున్నాయి.కొంతమంది ఈయొక్క వ్యాపారం ద్వారా గ్రామాల్లో ఆదిపత్యం చలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈమధ్య కాలంలో సివిల్ పోలీసులు,ఆబ్కారీ పోలీసులు తూతుమంత్రంగా దాడులు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండల కేంద్రమైన మఠంపల్లి లో సోమవారం గుడుంబా తాగి ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు పలువురు పేర్కొన్నారు. ఇప్పటి కైనా అధికారులు మొద్దు నిద్ర వీడి గుడుంబా తయారీ,అమ్మకం దారుల పై కఠినచర్యలు తీసుకొని గుడుంబా పై ఉక్కుపాదం మోపాలని మండల ప్రజలు కోరుతున్నారు.