వ్యక్తిగత కారణాలతో యువకుడి ఆత్మహత్య

వ్యక్తిగత కారణాలతో యువకుడి ఆత్మహత్య

ముద్ర ప్రతినిధి, బీబీనగర్: బీబీనగర్ మండలంలోని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ మీదుగా వెళ్తున్న హైటెన్షన్ విద్యుత్తు స్తంభానికి ఒక యువకుడు ఉరివేసుకుని మృతి చెందాడు. పోచంపల్లి మండలం పిలాయిపల్లికి చెందిన మృతుడి తల్లి మిర్యాల చంద్రమ్మ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు నరసింహ (26)గా పోలీసులు గుర్తించారు. వ్యక్తిగత కుటుంబ కారణాల రీత్యా తమ కుమారుడు ఈ దారుణానికి పాల్పడినట్టుగా అతని తల్లి ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు బీబీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని, ఎస్ఐ ఎస్.రమేష్ తెలిపారు.