బహుజనులు రాజ్యాధికారం చేపట్టాలి

బహుజనులు రాజ్యాధికారం చేపట్టాలి
  • దొరల గడీల్లో పాలేర్లు అధికార పార్టీ ఎమ్మెల్యేలు 
  • నిమిషాని  రామచంద్రం 

 శంకరపట్నం ముద్ర నవంబర్ 21: బహుజనులు రాజ్యాధికారం చేపట్టాలి అని, అధికార పార్టీ ఎమ్మెల్యేలు దొరల గడిల్లో పాలేరుగా ఉంటూ అభివృద్ధిని మర్చిపోయారని  మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నిషాని రామచంద్రం ధ్వజమెత్తారు.శంకరపట్నం మండలం కేంద్రంలో మంగళవారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో బహుజనులు అధికారంలోకి రావాలని  ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. సమాజంలో ఎవరి జనాభా ఎంతో వారికంత రాజ్యాధికారంలో వాటాలు కల్పిస్తామని ఆయన చెప్పారు.అసైన్డ్ భూములకు రక్షణ కల్పిస్తాం, ఐదేళ్లలో పది లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన తెలిపారు. 

బీసీలకు చట్టసభల్లో 70 వరకు ఎమ్మెల్యే సీట్లు కేటాయిస్తామని అన్నారు.ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిస్తామని ఆయన అన్నారు నాణ్యమైన విద్య వైద్యంలో ఉచితంగా అందిస్తామని విద్యార్థులకు విదేశాల్లో ఉచితంగా ఉన్నత విద్య అందిస్తామని ఆయన చెప్పారు రాష్ట్రంలో బెల్ట్ షాపులు పూర్తిగా నిషేధిస్తామని ఆయన వివరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రంగు సంపత్ గౌడ్, జిల్లా ఇన్చార్జ్ మంది బాలయ్య, అసెంబ్లీ ఇంచార్జ్ ఎగోల్ల వెంకన్న గౌడ్, మండల అధ్యక్షుడు దేవునురి భాస్కర్, ఉపాధ్యక్షులు దాసరపు మహేందర్, మండల ప్రధాన కార్యదర్శి ఎదురుగట్ల సంపత్, మండల కన్వీనర్ దాసరపు అరుణ్, నిలవేణి వైశాలి, నాయకులు తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.